Published On: Thu, Nov 19th, 2020

భ‌వ‌నాల నిర్మాణంలో ఇంకుడు గుంత‌లు త‌ప్ప‌నిసరి

* మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: బహుళ అంతస్తుల ఆక్యూపేన్సి సర్టిఫికేట్ మరియు ప్లాన్ల అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులకు సంబందించి భ‌వ‌నాలు, స్థలాల‌ను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధ‌వారం ఉద‌యం పటమట, అయ్యప్పనగర్, పోస్టల్ కాలనీ, న్యూ ఆర్.టి.సి కాలనీ, గుణదల, రామచంద్రనగర్, మాచవరం, మొగల్రాజపురం తదితర ప్రాంతాలలో బహుళ అంతస్తుల భవన నిర్మాణ ప్లాన్ అనుమతి కోసం, బహుళ అంతస్తులకు సంబందించి అక్యుపెన్సి సర్టిఫికేట్ అనుమతుల కొరకు ఆన్‌లైన్ నందు వచ్చిన దరఖాస్తులను మరియు ప్లాన్ అనుమతి కొరకు సమర్పించిన ప్లాన్ లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బహుళ అంతస్తూ భ‌వ‌నాలు వారు విధిగా ప్లాన్ నందు పొందుపరచిన ఇంకుడు గుంటలు సక్రమంగా నిర్వహించాలని ఆయా భవన యజమానులకు సూచించారు. తదుపరి గుణదల ప్రాంతములోని మోడల్ స్కూల్, 12వ వార్డ్ సచివాలయం మరియు అంగన్ వాడి కేంద్రాల‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పాఠశాల‌లో జరుగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తూ చేపట్టిన నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా అంగన్ వాడి కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరు మరియు పిల్లలకు అందించే ఆహార వివరాలు ప‌రిశీలించి పలు ఆదేశాలు జారిచేశారు. పర్యటనలో సిటీ ప్లానర్ లక్ష్మణరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ సూరజ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Just In...