Published On: Sat, Aug 21st, 2021

మంగళగిరిలో సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ షోరూం ప్రారంభం

* శ్రావణమాసం సందర్భంగా మగ్గం ధరలకే చేనేత వస్త్రాలు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: వస్త్ర వ్యాపార రంగంలో పేరొందిన చిల్లపల్లి సంస్ధల నుండి ప్రముఖ చేనేత కేంద్రమైన మంగళగిరిలో చిల్లపల్లి వారి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభమైంది. బైపాస్ రోడ్డులో సీఎన్ఆర్ గ్రానైట్స్ సమీపంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి సజ్జల లక్ష్మి షోరూమ్ ను ప్రారంభించారు. తొలుత చిల్లపల్లి పార్వతి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత చిల్లపల్లి వెంకటలక్ష్మీ నిరంజన్, వారి కుటుంబ సభ్యులు, నగర ప్రముఖులు, సన్నిహితులు, చేనేత వస్త్ర వ్యాపారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి వారి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత నిరంజన్ మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా స్పెషల్ ఆఫర్ గా మగ్గం ధరలకే చేనేత చీరలు విక్రయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పేరెన్నికగన్న ప్రముఖ చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్, షర్టింగ్స్, టవల్స్, బ్లాంకెట్స్, లుంగీలు అన్ని రకాల చేనేత వస్త్ర సముదాయంగా చిల్లపల్లి వారి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ నిలుస్తుందన్నారు. ప్రారంభోత్సవంలో శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్‌పర్సన్ పటమట స్నిగ్ధ, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ గోచిపాత శ్రీనివాసరావు, నవరత్నాల అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామి రెడ్డి, చెన్నా రాఘవేంద్రనాథ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భరత్‌రెడ్డి, చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొని శుభాశీస్సులు అందజేశారు.

Just In...