Published On: Tue, Aug 11th, 2020

మంచి నాయకుడిని కోల్పోయాం..

* మాణిక్యాల‌రావు కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన భాజ‌పా నేత రాంమాధవ్.

తాడేపల్లిగూడెం, సెల్ఐటి న్యూస్‌: పార్టీలో మంచి నాయకుడిని కోల్పోయాము అని భాజ‌పా నేత రాంమాధవ్ అన్నారు. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం తాడేప‌ల్లిగూడెంలోని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాంమాధ‌వ్ ‌పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి భాజపా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంద‌ని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ భాజపా సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ నూకల పాల్గొన్నారు.

Just In...