Published On: Sat, Nov 21st, 2020

మంత్రి పేర్ని నానీకి సీఎం ప‌రామ‌ర్శ‌

మ‌చిలీప‌ట్నం(కృష్ణా జిల్లా), సెల్ఐటి న్యూస్‌: ఇటీవల‌ మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ‌స‌భ్యుల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌‌రామ‌ర్శించారు. మంత్రి నానీ మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూశారు. ఈ క్ర‌మంలో మ‌చిలీప‌ట్నంలోని మంత్రి పేర్ని నాని ఇంటికి శ‌నివారం ఉద‌యం వెళ్లి నాగేశ్వ‌ర‌మ్మ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. మంత్రి పేర్ని నానీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వారిలో మంత్రులు కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్‌, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నారు.

Just In...