Published On: Sat, Jun 8th, 2019

మంత్రుల‌కు శాఖ‌లు ఖ‌రారు…

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యం స‌మీపంలో శ‌నివారం ఏర్పాటు చేసిన మంత్రివ‌ర్గ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత‌రం మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్‌ గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం తెలిపారు.

మంత్రులు-శాఖల వివరాలు…
1. బుగ్గన రాజేంద్రనాథ్ – ఆర్థిక శాఖ
2. మేకతోటి సుచరిత – హోంశాఖ
3. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ – రెవెన్యూ
4. అనిల్ కుమార్ యాదవ్ – ఇరిగేషన్ శాఖ
5. ధర్మాన కృష్ణదాస్‌ – రోడ్లు భవనాలు
6. బొత్స సత్యనారాయణ  – మున్సిపల్
7. అవంతి శ్రీనివాస్‌ – టూరిజం శాఖ
8. పాముల పుష్పశ్రీవాణి – గిరిజన సంక్షేమం
9. కురసాల కన్నబాబు – వ్యవసాయ, సహకార
10. పినిపే విశ్వరూప్‌ – సాంఘిక సంక్షేమం
11. బాలినేని శ్రీనివాస్‌ – అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
12. కొడాలి నాని – పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ
13. పేర్ని నాని – రవాణా, సమాచార శాఖ
14. తానేటి వనిత – స్త్రీ శిశుసంక్షేమం
15. చెరుకువాడ శ్రీరంగరాజు – గృహనిర్మాణ శాఖ
16. ఆళ్ల నాని – వైద్య, ఆరోగ్యం..
17. మేకపాటి గౌతమ్‌రెడ్డి – పరిశ్రమలు, వాణిజ్యం
18. వెల్లంపల్లి శ్రీనివాస్‌ – దేవాదాయ శాఖ
19. మోపిదేవి వెంకటరమణ – పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, మైనింగ్
21. ఆదిమూలపు సురేష్ – విద్యాశాఖ
22. నారాయణ స్వామి – ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్
23. గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
24. ఎం.శంకరనారాయణ – బీసీ సంక్షేమ శాఖ
25. అంజాద్ బాషా – మైనార్టీ వ్యవహారాలు

డిప్యూటీ సీఎంలు..
* పుష్ప శ్రీవాణి
* పిల్లి సుభాష్ చంద్రబోస్
* ఆళ్ల నాని
* అంజాద్ బాషా
* నారాయణస్వామి

స్పీకర్‌- తమ్మినేని సీతారం
డిప్యూటీ స్పీకర్- కోన రఘుపతి

Just In...