Published On: Wed, Jun 13th, 2018

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు

ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో కౌన్సెలింగ్‌

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనచోదకులకు మంగళవారం సాయంత్రం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ నెల 9న రాత్రి 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మొత్తం 17 కేంద్రాల్లో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనచోదకుల నుంచి 154 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 8 కార్లు, 2 లారీలను స్వాధీనం చేసుకున్న‌ట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వాహనచోదకులకు మహాత్మాగాంధీ రోడ్డులోని కె.ఎస్‌.వ్యాస్‌ కాంప్లెక్సులో ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, ఎస్‌.ఆర్‌.ఆర్‌. అండ్‌ సి.వి.ఆర్‌. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ వెలగా జోషి, సైకాలజీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు తదితరులు కౌన్సెలింగ్‌ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
 

Just In...