Published On: Wed, Nov 14th, 2018

మధుమేహంపై అవగాహన పెరగాలి

 * ప్రతిఏటా యలమంచి పౌండేషన్ సేవా కార్యక్రమాలు

* ఫౌండేష‌న్ ఛైర్మన్ డాక్ట‌ర్ యలమంచి సదాశివరావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మధుమేహం వైద్యంపై ప్రజలలో అవగాహన పెరగాలని, మధుమేహ వైద్యం నివారణకై గడ‌చిన 26 సంవత్సరాలుగా యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఛైర్మన్ డాక్ట‌ర్ యలమంచి సదాశివరావు పేర్కొన్నారు. బుధవారం యలమంచి పౌండేషన్ తరుపున 200 మందికి పైగా షుగర్ పేషంట్లకు ఉచిత పరీక్షలు, అవసరమైనవారికి ఉచిత మందులు, ఉచిత ఇన్స్లెన్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్ యలమంచి సదాశివరావు మాట్లాడుతూ ప్రజలలో మధుమేహ వైద్యం పట్ల అవగాహన పెంచేందుకు విభిన్న కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు. నేడు పాస్ట్ యుగంలో ప్రజలు విపరీతమైన మానసిక టెన్షన్స్ అనుభవించడం వలన వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సు నుండే మధుమేహ వ్యాధి సంక్రమిస్తుందని వ్యాధి వచ్చాక బయపడటం కన్నా నివారణ మార్గాలు, షుగరును అదుపులో ఉంచుకోవడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. తగిన శారీరక శ్రమ లేకపోవడం, విపరీతమైన జంక్ ఫుడ్స్ వలన ఊబకాయం పెరగడం వలన మధుమేహ వ్యాధి రావడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవ సందర్భంగా బుధవారం నాడు మధుమేహ వ్యాధిపై అవగాహన ర్యాలీని సూర్యారావుపేట హాస్పిటల్ నుండి ఏలూరు రోడ్ మీదుగా గవర్నరుపేట, యం.జి రోడ్ నుండి పిడబ్లూడి గ్రౌండ్స్ వద్ద ర్యాలీని ముగించారు. మధుమేహం పట్ల అవగాహన మేలు అనే కార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో డాక్ట‌ర్ ఆర్.రాజేంద్రప్రసాద్, డాక్ట‌ర్ యలమంచి హిమన, డాక్ట‌ర్ వై.అమూల్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క‌రికీ యోగ క్లాసులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. డైటీషియన్ తీసుకోవాల్సిన ఆహార నియమాలు గురించి ఉపదేశించారు.

Just In...