Published On: Wed, May 15th, 2019

మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి

* భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: హింసను ప్రేరేపిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అమిత్ షా ర్యాలీపై జరిగిన దాడికి నిరసనగా విజయవాడలో భారతీయ జనతా పార్టీ బుధవారం నిర్వహించిన ప్రదర్శనలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షాపై, తృణమూల్ కార్యకర్తల రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజామద్దతు కోల్పోయిన మమత బెనర్జీ, బెంగాల్లో భాజపాకు పెరుగుతున్న ఆదరణ చూసి తీవ్రమైన అసహనానికి గురయ్యారన్నారు. హింసద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని, తృణమూల్ కాంగ్రెస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఒక సిద్దాంతం లేదని విమర్శించారు. మానసికవ్యాధితో బాధపడుతున్నారని ఎపీకి హెూదా ఇస్తామని పేర్కొంటున్న కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే కర్నాటక వెళ్లి కాంగ్రెస్ కూటమికి, ఢిల్లీకి వెళ్ళి కేజీవాలకు మద్దతు ఇచ్చారన్నారు. అక్కడ అప్, కాంగ్రెస్, భాజపా పోటీ చేస్తున్నాయన్నారు. అలాగే బెంగాల్ వెళ్లి మమతకు మద్దతిచ్చారని అక్కడ భాజపా, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయన్నారు. ఒక సిద్దాంతం లేకుండా అవినీతే సిద్దాంతంగా ఉన్న అరాచక శక్తులన్నీ ఒకటై మోదీని ఓడించేందుకు ప్రయత్నించాయని, అయితే గడచిన ఆరు విడతల ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వీచిందన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు 300లకు పైగా ఎంపీ సీట్లు వస్తాయన్నారు. భాజపా విజయాలను చూసి ఓర్వలేని విపక్షాలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వీరంతా జైల్లో కలసి జైలు పార్టీ పెడతారని పరిహసించారు. మమతాను సమర్థిస్తున్న చంద్రబాబు పై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. భాజపా నగర ప్రధాన కార్యదర్శి కారణి ఆర్ముగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర ఉ పాధ్యక్షులు తురగా నాగభూషణం, మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, రాష్ట్ర అధికారప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎమెల్యే అభ్యర్థులు వాసమూర్తి సత్యమూర్తి, పీయూష్ దేశాయ్, వంగవీటి నరేంద్ర, శ్రీరాములు, గుడివాక అంజిబాబు, రాష్ట్ర కార్యదర్శులు అడపా శివనాగేంద్రరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Just In...