Published On: Tue, May 19th, 2020

మళ్లీ ఎకనామీకి పరుగులు…

* సంక్షేమంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ

* పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో క్యాలెండర్‌ ప్రకటన

* కోవిడ్‌ అంటే భయం, ఆందోళన పోవాలి

* పరీక్షలు, వైద్యానికి ప్రజలు ముందుకు రావాలి.. ఇదే అంతిమ పరిష్కారం

* ఆగస్టు 3న పాఠశాలల ప్రారంభం

* జులై 31లోగా పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు

* జిల్లాకు మూడు జేసీలతో విధినిర్వహణలో స్పష్టత

* గ్రామంపైన ఇంతగా దృష్టిపెట్టిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదు

* స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో ప్ర‌జా సంక్షేమంతో పాటు ఆర్థిక పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గాల‌ని ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్పందనపై కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

వీడియో కాన్ఫరెన్స్‌ లో చర్చకు వచ్చిన ప్రధాన అంశాలు..
కోవిడ్‌–19

– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్‌

– ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత

– జాతీయ ఉపాధి హామీ పథకం, ఆర్‌బీకేలు, వైయస్సార్‌ గ్రామ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు.

– తాగునీరు. వేసవిలో కార్యాచరణ ప్రణాళిక.

– పాఠశాలల్లో నాడు – నేడు

– పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ

– ఇసుక, మద్యంలో అక్రమాల నివారణ

– జిల్లాకు ముగ్గురు జేసీలు, వారి విధులు

వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించిన కీలక అంశాలు.

రాష్ట్రంలో కోవిడ్‌–19 పరిస్థితి:

· దేశంలోనే అత్యధికంగా 2,48,711 శాంపిళ్లు పరీక్షలు చేశాం: ముఖ్యమంత్రి

· ప్రతి పదిలక్షల జనాభాకు 4840 మందికి పరీక్షలు చేశాం

· పరీక్షల్లో మనం (ఆంధ్రప్రదేశ్‌) నంబర్‌ ఒన్‌

· కరోనా వైరస్‌ నుంచి 1527 మంది పూర్తిగా రికవరీ అయ్యారు

· 705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. (వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు)

· రాష్ట్రంలో 0.94 శాతం పాజిటివిటీ ఉంది

· 63.82 శాతం రికవరీ రేటు ఉంటోంది..

· 2.06 శాతం మరణాల రేటు.

· ఈ డేటా అంతా చూశాక మనం కోవిడ్‌–19ను బాగానే నియంత్రించామని చెప్పగలం:

· నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అని.

· ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా మిమ్మల్ని గుర్తించి బాధ్యతలు అప్పగించాం:

· పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను:

· అందుకే మీరే మా బలమని చెప్తున్నాను:

· కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే:

· మీరు కోవిడ్‌ –19 నివారణలో అద్భుతంగా పని చేశారు:

· గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్‌ంలు, డాక్టర్ల దగ్గర నుంచి, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ అద్భుతంగా పని చేశారు:

ఇప్పుడు ఏం చేయాలి?:

· మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం:

· ఇంతకు ముందు మనం అనుసరించిన పద్దతి వేరు:

· ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు:

· ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది:

· కోవిడ్‌ –19 నివారణపై దృష్టి కొనసాగిస్తూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది:

· ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలి:

· దీంట్లో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యం కావాలి:

· షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు.. ఇవి తప్ప మిగిలిన చోట్ల కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉంది:

· చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఓపెన్‌ చేయాలి:

· రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుంది:

· ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయి:

· ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి:

· ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ.. అన్నీ ఓపెన్‌ కావాలి.

భయం తొలగాలి:

· మనం కోవిడ్‌–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది:

· కోవిడ్‌ –19 సోకిన వారిని వివక్షతో చూడడం అన్నది సమాజం నుంచి తొలగించాలి:

· ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి:

· కోవిడ్‌ సోకిన వారిని వివక్షతతో చూడకూడదు:

· రాబోయే కాలంలో కోవిడ్‌ రాని వారు ఎవ్వరూ ఉండరేమో?:

· అది వస్తుంది.. పోతుంది కూడా :

· కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలి:

· ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలి.

ఎలాంటి పరిస్థితి రావాలి?:

· ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ముందుకు వచ్చేలా చూడాలి:

· ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలి:

· దీన్ని మనం ప్రోత్సహించాలి:

· పరీక్షల కోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలన్నది ఎడ్యుకేట్‌ చేయాలి?:

· పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి:

ఈ ప్రక్రియలో ఇంకా..:

· రాబోయే రోజుల్లో వైయస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నాం:

· వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి:

· అనుమానం ఉన్న వారు అక్కడకు వెళ్లి.. పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలి:

· ప్రజలకు అందుబాటులో టెస్టింగ్‌ సదుపాయాలను తీసుకు వెళ్లాలి:

· ప్రజల్లో పూర్తిగా భయాందోళనలను తొలగించాలి:

· కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి:

· భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలి:

· ఆస్పత్రులను పూర్తిగా సన్నద్ధం చేసుకోవాలి:

· కోవిడ్‌ కేసుల్లో 98 శాతం మంది రికవరీ అయ్యి ఇంటికి వెళ్లిపోతున్నారు:

· 85 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొంది కోలుకుంటున్నారు:

· ఈ రెండు ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

· ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో పాటు, దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారే మరణానికి గురవుతున్నారు:

· వైరస్‌ సోకిన వెంటనే వారు ఆస్పత్రికి రాగలిగితే.. మరణాలు లేకుండా చూడగలం:

· కాని, వైరస్‌ వల్ల భయాందోళన కారణంగా వారు బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండడం లేదు:

· చివర దశలో ఆస్పత్రికి వస్తున్నారు:

· అలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడ్డం కష్టం అవుతుంది:

· వైరస్‌ రావడం తప్పు కాదు, వస్తే.. వైద్య సిబ్బందికి చెప్తే చాలు.. వారు అన్నిరకాలుగా తోడుగా ఉంటారు:

· ఎకానమీ ఓపెన్‌ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి:

ప్రభుత్వ కార్యక్రమాలు – క్యాలెండర్‌

· ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి? తిరిగి ఎలా పునరుత్తేజం తీసుకురావాలి? అన్న ఆలోచనతో ఈ క్యాలెండర్‌ తయారు చేశాం:

· కలెక్టర్లు, జేసీలు దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలి.

మే 22వ తేదీ:

· ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్‌) మొత్తం రూ.905కోట్లలో సగం చెల్లింపు.

· మిగిలిన సగం మొత్తం జూన్‌లో చెల్లింపు.

· రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల ఉద్యోగాలను ఎంఎస్‌ఎంఈలు ఇస్తున్నాయి:

· ఆ యూనిట్లు్ల.. వారి కాళ్ల మీద వారు నిలబడాలి:

· కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు కూడా రద్దు చేస్తూ జీవో ఇచ్చాం:

· 3 నెలల పాటు ఆ ఛార్జీలు రద్దు అవుతాయి:

మే 26వ తేదీ:

· అర్చకులు, పాస్టర్లు, ఇమామ్స్, మౌజంలకు రూ.5 వేల చొప్పున ఒన్‌టైం సహాయం.

మే 30వ తేదీ:

· రైతు భరోసాకేంద్రాలు ప్రారంభం అవుతాయి:

· గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఇవి మారుస్తాయి:

· దీని కోసం ఒక జేసీని కూడా పెట్టాం:

· గ్రామాల్లో ఆర్బీకేలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయి.

జూన్‌ 4వ తేదీ:

· వైయస్సార్‌ వాహన మిత్ర ఇస్తున్నాం:

· సొంత ఆటో, సొంత క్యాబ్‌ ఉన్న వారికి జూన్‌ 4న రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం.

జూన్‌ 10వ తేదీ:

· జూన్‌ 10 న నాయిబూ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు.. షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఏడాదికి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం:

ఆమేరకు ఇస్తున్నాం:

· జూన్‌ 17న మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైయస్సార్‌ నేతన్న నేస్తం ఇస్తాం:

· ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ ఇదే తేదీన చెల్లిస్తాం:

· మాస్క్‌ల తయారీకి ఆప్కో దగ్గరనుంచి బట్ట తీసుకున్నాం. ఆ బట్టకుసంబంధించిన డబ్బుకూడా వెంటనే చెల్లిస్తున్నాం:

· జూన్‌ 24న వైయస్సార్‌ కాపునేస్తం అమలు చేస్తున్నాం:

· 45–60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకూ తోడుగా ఉండేందుకు రూ.15వేలు ఇస్తున్నాం:

· జూన్‌ 29న ఎంఎస్‌ఎంఈలకు సంబధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల :

· జులై 1న 104, 108 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం

· మొత్తం 1060 కొత్త వాహనాలు ప్రారంభం

· ఇవన్నీ ప్రజలకు అందుబాటులో వస్తాయి

· జులై 8న వైయస్సార్‌గారి పుట్టినరోజు

· ఈరోజున ఇళ్లపట్టాలు పంపిణీ

· 27 లక్షల ఇళ్లపట్టాలు పంపిణీ

· జులై 29న రైతులకు సంబంధించి వడ్డీలేని రుణాలు

· ఆగస్టు 3వ తారీఖున వైయస్సార్‌ విద్యా కానుక

· పిల్లలకు యూనిఫారం, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు ఇస్తాం

· ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం నాడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ

· ఐటీడీఏలున్న కలెక్టర్లు అందరు కూడా దీనిపై దృష్టిపెట్టాలి

· ఆగస్టు 12వ తేదీన వైయస్సార్‌ చేయూత

· ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ అక్కకు 45–60 ఏళ్ల మధ్య ఉన్నవారు రూ.18,750లు ఆరోజు పెట్టబోతున్నాం

· ఆగస్టు 19న వైయస్సార్‌ వసతి దీవెన కార్యక్రమం

· ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు భోజనం,లాడ్జింగ్‌ కోసం

· పిల్లల తల్లులకు రూ.10వేల చొప్పున మొదటి దఫా వసతి దీవెన

· ఆగస్టు 26న హౌసింగ్‌ నిర్మాణం

· 15 లక్షల వైయస్సార్‌ హౌసింగ్‌ శాంక్షన్, ఇళ్ల నిర్మాణం ప్రారంభం

 

 

Just In...