Published On: Sun, May 20th, 2018

మహానాడులో మీడియాకు ప్రత్యేక ఏర్పాట్లు

* ఇన్‌ఛార్జ్‌ల‌కు దిశానిర్దేశం చేస్తూ కమిటీలో నిర్ణయం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్న మ‌హానాడులో మీడియాకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని మ‌హానాడు మీడియా క‌మిటీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వెల‌గ‌పూడిలోని  సచివాలయంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో మంత్రి సోమిరెడ్డితో పాటు జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన శ‌నివారం మహానాడు-2018 మీడియా కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హానాడులో మీడియా మిత్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ మీడియా ప్రతినిధులతో పాటు హైదరాబాద్, విజయవాడ మీడియా ప్రతినిధులకు కావాల్సిన సౌకర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా నియ‌మించిన టీడీపీ బృందానికి ఇన్‌ఛార్జ్‌లుగా తెలుగుదేశం పార్టీ నాయకులను నియమించడం జరిగింది. ఈ స‌ద‌ర్భంగా మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ మ‌హానాడులో మీడియా మిత్రులను గౌరవించాలని ఇన్‌ఛార్జ్‌ల‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ, రాష్ట్ర నాయకులు లింగంనేని శివరామప్రసాద్, విజయవాడ పట్టణ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి సింహాద్రి అశోక్, కృష్ణా జిల్లా అర్బన్ ప్రచార కార్యదర్శి కె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Just In...