Published On: Thu, Jul 9th, 2020

మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలి

మంగ‌ళ‌గిరి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కలిశారు. మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చిన కేసుల వివరాలను డీజీపీకి వివ‌రించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కేసులపై డీజీపీతో చర్చించినట్టు చెప్పారు. గుంటూరులో నగ్న వీడియోల కేసు మరవకముందే మరో కేసు నమోదైంద‌ని పేర్కొన్నారు. కేసులకు సంబంధించి పోలీసుల పాత్రపై విచారించి చర్యలు తీసుకోమని డీజీపీని కోరినట్టు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. దిశా యాప్‌ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సైబర్‌ నేరాలకు పాల్పడేవారిపై మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Just In...