Published On: Fri, Nov 1st, 2019

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు..

* రిమాండుకు తరలింపు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపుకు పాల్పడిన వ్యక్తిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉయ్యూరు పట్టణానికి చెందిన బజాజ్ షోరూం దగ్గర లో నివసించే ముస్లిం మహిళపై ఆ కుటుంబానికి బంధువు అయిన గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట కు చెందిన అబ్దుల్ గఫార్ అనే వ్యక్తి మహిళా ఒంటరిగా ఇంట్లో ఉండగా అసభ్యకరంగా ప్రవర్తించిన వేధించిన నేపథ్యంలో బాధిత మహిళా గురువారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పట్టణ ఎస్సై గురు ప్రకాష్ నిందితుడు అబ్దుల్ గఫార్ పై IPC 354,448,323, సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేశారు. నిందితుడు అబ్దుల్ గఫార్ ను ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Just In...