Published On: Thu, Aug 8th, 2019

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజీనామా

సెల్ఐటి న్యూస్, అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం తన రాజీనామా లేఖను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందజేశారు. తెదేపా హయాంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి.. ప్రభుత్వం మారింది గనక నైతికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడున్నరేళ్ల తన పదవీ కాలంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్‌కు మూడేళ్ల వార్షిక నివేదిక అందజేసినట్టు వివరించారు. తన నివేదికను గవర్నర్‌ అభినందించారన్నారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానన్నారు. వసతిగృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్ఠ పరచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Just In...