Published On: Fri, Nov 30th, 2018

మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

* కాలిబూడిదైన జ‌న‌రేట‌ర్‌, విద్యుత్తు సామాగ్రి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: గుంటూరు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని జనరేటర్‌ గదిలో మంటలు చెలరేగాయి. గమనించిన వాచ్‌మెన్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమై గదిలో మంటలను అదుపుచేశారు. ఈలోగా గదిలో ఉన్న జనరేటర్‌తో పాటు విద్యుత్ సామాగ్రి మంటల్లో కాలి బూడియ్యింది. గతంలోనూ ఈ ఆసుపత్రిలో రెండు సార్లు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని వైద్యులు చెబుతున్నారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే ఈ సంఘటన షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల జరిగిందా? మానవ తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది.

Just In...