Published On: Tue, Oct 1st, 2019

మార్కెట్లోకి టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ఐ-టచ్ స్టార్ట్ వాహనాలు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ద్విచక్ర , త్రిచక్ర వాహన తయారీలో ప్ర‌సిద్ధి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ ఎక్స్ఎల్ 100  కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ కంఫర్ట్ మోపెడ్‌ను మార్కెట్లోకి  ప్రవేశపెట్టింది. స్టైలిష్ హెడ్ లాంప్, డబుల్ టోన్ సెట్, కుషన్ బ్యాక్ రెస్ట్, క్రోమ్ ఎలిమెంట్స్, లెగ్ గార్డ్,  సైలెన్సర్ గార్డ్, హైడ్రాలిక్ సస్పెన్షన్ వంటి అంశాలతో ఈ వాహనం మార్కెట్లోకి  రానుంది. టీవీఎస్ ఎక్స్ఎల్100  కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ కంఫర్ట్‌ని సోమవారం విజ‌య‌వాడ గేట్ వే హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో టీవీఎస్ యుటిలిటీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.విశ్వనాథన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవీఎస్ బ్రాండ్ కొనుగోలుదారుల నమ్మకాన్ని చూరగొంటూ 1.25 కోట్లకు పైగా ఖాతాదారులను కలిగి వుందన్నారు. ఆటోమేటిక్ గేర్‌తో వచ్చే ఈ వాహనం పెరుగుతున్న ఖాతాదారులకు అవసరం. త‌మ ఖాతాదారుల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసామన్నారు. కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ కంఫర్ట్‌తో ట్రాఫిక్ సమస్య తీరడమే కాకుండా, అతి తక్కువ స్పేస్‌తో ఈ బండిని పార్క్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. చాల స్లిమ్‌గా కనిపించే టీవీఎస్ ఎక్స్ఎల్100  కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ కంఫర్ట్ మూడు ఆకర్షణీయమైన రంగులతో లభిస్తుందని, 99.7 సీసీ ఇంజిన్ కెపాసిటీతో లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వివరించారు. 60 ఇంచెస్ లార్జ్ వీల్స్‌తో రూ.40,724 ఎక్స్ షోరూం ధరతో ఆంధ్ర, తెలంగాణలో అందుబాటులో ఉంటుందని ఎస్.విశ్వనాథన్ తెలిపారు.

Just In...