Published On: Wed, Nov 28th, 2018

మార్కెట్‌లో ఎల్‌జి నూత‌న వాట‌ర్ ఫ్యూరీఫైయ‌ర్

* 7 మోడ‌ల్స్‌, విభిన్న రంగుల్లో అందుబాటులోకి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నీటి కాలుష్యాన్ని నివారించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల్‌జి కంపెనీ అత్యాధునిక టెక్నాల‌జీతో కూడిన స‌రికొత్త వాట‌ర్ ఫ్యూరీఫైయ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం అభినంద‌నీయ‌మ‌ని న‌గ‌రానికి చెందిన ప్ర‌ముఖ చెవి, ముక్కు, గొంతు వైద్యులు డాక్ట‌ర్ న‌వీన్‌, ప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్ చంద్ర‌మోహ‌న్ అన్నారు. రింగ్‌రోడ్డులోని రామ‌చంద్రాన‌గ‌ర్‌లో ఉన్న ఎల్‌జి ప్రాంతీయ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారిరువురూ మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి నీటి అవ‌స‌రం చాలా ముఖ్య‌మ‌ని, ప్ర‌తివ్య‌క్తి రోజూ క‌నీసం 3 నుంచి 5 లీట‌ర్ల నీటిని తీసుకోవాల‌న్నారు. అయితే ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణంలో కాలుష్య ప్ర‌భావం కార‌ణంగా నీరు క‌లుషిత‌మ‌వ‌డంతో ఎక్కువమంది త్రాగునీటిని త‌గిన మోతాదులో తీసుకోలేక‌పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పూర్వ‌కాలంలో స్వ‌చ్ఛ‌మైన నీటిని తీసుకోవ‌డానికి కాచి చ‌ల్లార్చి తీసుకునేవార‌ని చెప్పారు. అయితే అది అధిక శ్ర‌మ‌, ఎక్కువ వ్య‌యం కావ‌డంతో ఎల్‌జీ కంపెనీ నూత‌న టెక్నాల‌జీతో అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి స్వ‌చ్ఛ‌మైన నీటిని అందించేందుకు ఎల్‌జి కంపెనీ వాట‌ర్ ఫ్యూర్ ఫైయ్య‌ర్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రిగింద‌న్నారు. దీనిలో డ్యూయ‌ల్ ప్రొటెక్ష‌న్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకు, డిజిట‌ల్ స్టెరిలైజింగ్ కేర్ టిఎం ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప‌రిశుభ్ర‌మైన త్రాగునీటిని అందిస్తుంద‌ని చెప్పారు. బ్రాంచ్ మేనేజ‌ర్ యుగంధ‌ర్ మాట్లాడుతూ సాధార‌ణ నీటిలో ఎక్కువ బ్యాక్టీరియా, ఫంగ‌స్ ఉంటుంద‌ని, వాట‌ర్‌ని ఫ్యూరిఫై చేసుకోవ‌డం ఎంతో ముఖ్య‌మ‌ని తెలిపారు. మ‌నం తీసుకునే నీటిలో ప‌రిశుభ్రంతో పాటు మిన‌ర‌ల్స్ కూడా ఉండాల‌న్నారు. ఈ త‌ర‌హా అన్ని స‌దుపాయాల‌తో కూడిన వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్‌ను ఎల్‌జి సంస్థ నూత‌న టెక్నాల‌జీతో అందుబాటులోకి తీసుకువ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఈ వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ 8 లీట‌ర్ల సామ‌ర్ధ్యంతో 7 మోడ‌ల్స్‌, మూడు రంగుల్లో రూ.16 వేల నుంచి రూ.30 వేల వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఎల్‌జి సంస్థ నూత‌న టెక్నాల‌జీతో రూపొందించిన వాట‌ర్ ఫ్యూరిఫైయ‌ర్ ప‌నితీరును మీడియా ఎదుట ప్ర‌ద‌ర్శించారు.

Just In...