Published On: Mon, Dec 3rd, 2018

మార్చి 18 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు

* షెడ్యూల్డ్ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. పరీక్షల దరఖాస్తుకు ఈ నెల 7న చివరి తేదీగా పేర్కొన్నారు. పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ స‌మ‌యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామని తెలిపారు.

Just In...