Published On: Thu, Aug 15th, 2019

మా సేవలు వెలకట్టలేనివి…

* డాక్టర్ రమేష్

సెల్ఐటి న్యూస్, విజయవాడ: 1988వ సంవత్సరంలో ఆరు పడకలతో డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మొట్టమొదటిగా రమేష్ హాస్పిటల్స్ ప్రారంభమైంది.1996వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మచే చెన్నై నుండి కోల్‌కత మధ్య ప్రాంతంలో మొట్ట మొదటి గుండె క్యాతటరైజేషన్ ల్యాబ్, గుండె ఆపరేషన్ థియేటర్లతో 165 పడకల హాస్పిటల్ ను ప్రారంభించారు. 1998వ సంవత్సరం నందు ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక గుండె ఆపరేషన్లను 99.5% సక్సెస్ రేటుతో నిర్వహించినందుకుగాను లిమ్కా బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డ్స్ లో రమేష్ హాస్పిటల్ పేరు నమోదు అయింది. 2015వ సంవత్సరంలో మాజీ రాష్టపతి అబ్దుల్ కలాంచే గుంటూరులో అధునాతనమైన 350 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. నామమాత్రపు రుసుముతో గ్రామీణ ప్రాంతాల్లో ఇసిజి పరీక్షను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజల్లో గుండెపోటు వచ్చినప్పు డు మొదటి గంటలో ఇసిజి ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ప్రైమరీ హార్ట్ & బ్రెయిన్ స్టోక్ టెలిమెడిసిన్ సెంటర్ల ద్వారా సత్వరమే అత్యవసర వైద్యం అందిస్తున్న వినూత్న ప్రాజెక్టుకు ఏషియన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అవార్డు దక్కింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు డిశ్చార్జ్ తర్వాత అందించే సేవల విషయంలో “త్రీ-టు-వన్” అనే వినూత్నమైన ప్రాజెక్టు రూపకల్పన చేసి, అవలంబిస్తున్నందుకుగాను ఏషియన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మక ఫి క్కీసంస్థ నుంచి ఆరోగ్య సంరక్షణలో అవలంబిస్తున్న నాణ్యత ప్రమాణాల విషయంలో హెల్త్ కేర్ అవార్డు లభించింది. ఇండియన్ మెడిక ల్ అసోసియేషన్ ప్రతిష్టాకరమైన డాక్టర్ శరన్ కార్డియాలజీ ఎక్సెలెన్స్ అవార్డును రమేష్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబుకు అందజేశారు. భారత ప్రభుత్వం మరియు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్.బి.ఇ.) గుర్తింపుతో బ్రాడ్ మరియు సూపర్ స్పెష లిటీ వైద్యవిద్యా కార్యక్రమాలు నిర్వహణలో ఉన్న విజయవాడ, గుంటూరు, ఒంగోలు నందు ఉన్న అన్ని హాస్పిటల్స్ కు ఎన్‌ఎబిహెచ్ నాణ్య తా ప్రమాణాల సంస్థ గుర్తింపు. 95వేల యాంజియోగ్రామ్ లు, 17 వేల యాంజియోప్లాస్టీలు, 2200 పైమరీ యాంజియోప్లాస్టీలు, 19వేల గుండె ఆపరేషన్ల ను విజయవంతంగా నిర్వహించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం 25 టెలిమెడిసిన్ సెంటర్లను గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 24గంటలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 65 వేల మంది రోగులకు ఉచిత రక్తపోటు, షుగరు, గుండెపోటు, పక్షవాతం వ్యా ధులకు తక్షణమే ఉచిత ప్రాథమిక వైద్య చికిత్స ఒక లక్ష మంది విద్యార్థులు, పౌరులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లకు బేసిక్ లైఫ్ సపోర్టు నందు శిక్షణ పొందారు. రాష్ట్రవ్యాప్తంగా క్రెడిట్ అవర్స్” తో నిరంతర వైద్యవిద్యా కార్యక్రమాలు నిర్వహణ గుండెపోటు, పక్షవాతం వ్యాధులలో “మొదటి గంట అమూల్యం” అనే విషయాన్ని ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించడానికి గోల్డెన్ అవర్ అవగాహన కార్యక్రమాలు పాకిస్తాన్, నైజీరియా, కంబోడియా, బెల్జియం, రష్యా, న్యూజిలాండ్ దేశీయులకు నాణ్యత కలిగిన వైద్యం అందించడంతో ఆంధప్రదేశ్‌లో మెడికల్ టూరిజంకు నాంది. జీవన్‌దాన్ గుర్తింపుతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను గుంటూరు మరియు ఒంగోలు నందు, లివర్ మరియు గుండె మార్పిడి ఆ పరేషన్లను గుంటూరు హాస్పిటల్ నందు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోనే ముగ్గురు పూర్తిస్థాయి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు, ఇద్దరు పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ల ఆధ్వర్యంలో ఒక రోజు శిశువు మొదలుకొని చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకుడివైస్ క్లోజర్ మరియు శస్త్ర చికిత్సలు నిర్వహిం చే సెంటర్‌గా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ. 120 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు 170 మంది మెడికల్ ఆఫీసర్లు, 750 మంది ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది, 1600 మంది పారామెడికల్, లేబరేటరీ మరియు మేనేజీరియల్ సిబ్బందితో 24గంటలు అత్యవసర వైద్య సర్వీసులను అందిస్తుంది. ఒక వెయ్యికి పైగా వైద్య శిబిరాలు నిర్వహించాము.

Just In...