Published On: Mon, Aug 19th, 2019

మీకు అండగా ఉంటా…

* ఫోటోగ్రాఫర్లకు మంత్రి కొడాలి నాని

సెల్ఐటి న్యూస్, గుడివాడ: అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని ఫోటోగ్రాఫర్లు నేడు ఫోటోగ్రఫీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. 181వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక ఎన్జీవో హోమ్ లో ది గుడివాడ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కెమెరా సృష్టికర్త లూయిస్ డ్యాగురే చిత్రపటానికి పులమాలలతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నాని మాట్లాడుతూ మనలో ఉన్నా టాలెంట్ ను వెలికితీసి అందుబాటులో ఉన్న ఆధునిక ఫోటోగ్రఫీ సాంకేతికతను వినియోగించుకొని తమదైన శైలిలో కెమెరాల ద్వారా అద్బుతమైన ఛాయాచిత్రాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు. గుడివాడ ఫోటోగ్రాఫర్లకు అన్ని వేళలా అండగా ఉంటానని మంత్రి నాని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు మంత్రి నాని గుర్తింపు కార్డులు అందచేసారు. అనంతరం మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ను గుడివాడ ఫోటోగ్రఫీ అసోసియేషన్ గజమాల వేసి జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మరిధు హరిబాబు, కార్యదర్శి వంశీపవన్, నాయకులు జక్రియా, నాగరాజు, శరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Just In...