Published On: Thu, Oct 15th, 2020

ముంపు ప్రాంతాల్లో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

* రైతుల‌కు త‌క్ష‌ణం నష్టపరిహారం ప్రకటించాలి

* కాంగ్రెస్ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి

* ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఏపిసిసి అధ్యక్షులు డాక్ట‌ర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా ముంపున‌కు గుర‌య్యాయ‌ని తెలిపారు. రైతులు హాహాకారాలు చేస్తూంటే ప్రభుత్వం తగిన చర్యలు, సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమవుతుంద‌న్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగడంతో పంట పొలాలే కాక ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ఆయా జిల్లాల్లో వందలాది మంది నిరాశ్రయుల‌య్యార‌ని అన్నారు. అలాగే వ‌ర్షాల‌కు కొండ ప్రాంతంలో కొండ చరియలు విరిగిప‌డి ప‌లువురు గాయాలపాలయ్యారన్నారు. వర్షాలు నేప‌ధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వారిని తరలించడం ముందస్తు హెచ్చరికలు ప్ర‌‌భుత్వం చేయలేదన్నారు. ఇప్పటికైనా గృహాలు కోల్పోయిన వారికి, నీటమునిగిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలన్నారు.

Just In...