Published On: Fri, Jul 31st, 2020

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ముస్లిం సోదరులకు, సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌
శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు. బక్రీద్‌ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు.

 

Just In...