Published On: Sat, May 30th, 2020

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఏడాది పాల‌న‌లో ఎన‌లేని అభివృద్ధి…

* వైకాపా విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్
విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌ ల‌ఏడాది పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగింద‌ని, ఏడాదిలో మానిఫెస్టోని అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయవాడ వైకాపా విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ పార్టీలకతీతంగా అన్నివర్గాల అభివృద్ధి కోసం పని చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న పధకాలతో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూసేలా ఉన్నాయ‌ని తెలిపారు. కృష్ణలంక వాసుల చిరకాల వాంఛ తీర్చేందుకు రూ.120 కోట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ప్ర‌శంసించారు. సీఎం ఆశీస్సులతో రిటైనింగ్ వాల్ పూర్తయితే వరద కష్టాలు తీరిపోతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. నియోజకవర్గంలో రూ.10కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ ఏడాది కాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామ‌న్నారు. ఐదేళ్లల్లో టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింద‌ని ఆరోపించారు. సీఎం జగన్ అభివృద్ధి పనులు చేస్తుంటే మోకాళ్ళు అడ్డుతున్నార‌ని, టీడీపీ కుట్రలు, కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నార‌ని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు కష్టం కలగకుండా చేసి పాలనాదక్షతను సీఎం చాటుకొన్నార‌ని తెలిపారు. కరోనా సమయంలో పారిపోయిన టీడీపీ జూమ్ యాప్ కాన్ఫరెన్స్‌లకే పరిమితమైంద‌న్నారు.
భవిష్యత్తులో తెలుగుదేశం వెబ్ సమీక్షల పార్టీగానే మిగిలిపోతుంద‌ని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ నేతృత్వంలో పాలన దివంగత వైఎస్ఆర్ పాలనను మరిపించేలా ఉంద‌న్నారు. అందరూ ఆస్తులను వారసత్వంగా తీసుకొంటే వైఎస్ జగన్ తండ్రి ఆశయాలను లక్ష్యంగా చేసుకొన్నార‌ని తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో పార్టీ నాయ‌కులు కడియాల బుచ్చిబాబు, ఆళ్ల చల్లారావు, వెంకట సత్యం, ముసునూరి సుబ్బారావు, మీర్ హుస్సేన్, అంబెద్కర్, సుబ్బరాజు, కోఠినాగులు, దామోదర్, చాలపటి వెంకటేశ్వర‌రావు, కొండారెడ్డి, రామిరెడ్డి, జి.ప్రసన్న, రాజ్‌కమల్ పాల్గొన్నారు.

Just In...