Published On: Mon, Aug 10th, 2020

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

* అగ్ని ప్రమాద ఘటనపై వివరాలు తెలిపిన సీఎం జ‌గ‌న్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విజయవాడలోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఆదివారం ఉద‌యం ఫోన్‌ చేశారు. ఈ ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలిపారు. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు, దురదృష్టవశాత్తూ కొంద‌రు మృత్యువాత పడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా గ‌తంలోనే అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్న‌ట్లు ప్ర‌ధానికి వివ‌రించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానికి సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు.

Just In...