Published On: Thu, Jul 9th, 2020

ముఖ్య‌మంత్రి జ‌‌గ‌న్ తరతరాలకు గుర్తుండుపోయే చరిత్రకారుడు

* సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ చేసిన మంచి అందరికీ గుర్తుండిపోయే విధంగా విజయవాడ నగరం నడిబొడ్డున విశాలమైన ప్రదేశాన్ని ఎంపికచేసి ఆయనను గౌరవిస్తూ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే కార్యక్రమానికి బుధవారం సాయంత్రం సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ డా. బి.ఆర్.అంబేద్కర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని అన్నారు. అంబేద్కర్‌ను గౌరవిస్తూ ఇలాంటి చోట ఇలాంటి వ్యక్తి విగ్రహం ఉండాలని ఆలోచించినప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి ఎప్పుడూ గుర్తుంచుకునేలా సమాజానికి ఆయన చేసిన మంచిని తరతరాలకు తెలియజేసేలా విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. అటువంటి చోట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రదేశం రాష్ట్రం మొత్తం చూడదగ్గ ప్రదేశంగా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ ప్రదేశాన్ని సుందరంగా మార్చడం ద్వారా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రదేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంతో పాటు గ్రంథాలయం, స్మారక భవనం, అధ్యయన కేంద్రం, ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేస్తారు అని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేదికపై ఉన్న డా. జి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 126 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం ద్వారా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. తరతరాలకు గుర్తుండిపోయే ఆ చరిత్రకారుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అని కొనియాడారు. ఇంత ఎత్తైన డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ ప్రాంతం అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా కూడా విలసిల్లుతుందన్నారు. ఇప్పటి నుండి ఈ ప్రదేశాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ స్వరాజ్య మైదానంగా పిలవడం జరుగుతుందన్నారు. దళితుల గౌరవించే చరిత్ర స్వర్గీయ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఉందని, ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి ఎస్ట్ తన తండ్రి కంటే రెండింతలు ఎక్కువ పేరు తెచ్చుకుంటాను, ప్రజలకు సేవ చేస్తారని, ఇచ్చిన మాటకు కట్టుబడి అంటున్నారన్నారు అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి భవిష్యత్ తరాలు గుర్తుంచుకొనేలా విజయవాడ నగరంలోని కీలకమైన బందరు రోడ్డు సమీపాన ఏర్పాటు చేయడం దళితులపై ఆయనకున్న అభిమానాన్ని చాటుతోందన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని 2022 ఏప్రిల్ 14 నాటికి పూర్తిచేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభింపజేస్తామన్నారు. ఎవ్వరూ కూడా విజయవాడ నగరం నడిబొడ్డున డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారన్న ఆలోచన రాలేదని ఇందుకు సంకల్పించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డికి దళితుల తరపున రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ మాట్లాడుతూ మహానుభావుడు స్వర్గీయ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినం అని అటువంటి మంచిరోజున ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి గా, బి, ఆర్.అంబేద్కర్ అని ఆయన విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడమంటే నిజంగా సాహసం చేయడమేనని అన్నారు. దళితులకు, దేశ ప్రజలకు ఆరాధ్యుడైన డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడో మారుమూల ప్రదేశంలో పెట్టాలని గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఆలోచన చేసి అది కూడా నెరవేర్చలేకపోయారని పేర్కొన్నారు. శాసనసభ్యులు మెరుగు నాగార్జున వందన సమర్పణ చేస్తూ రాష్ట్ర ప్రజలకు నిండు సభలో హామీ ఇచ్చి తిలోదకాలిచ్చిన వారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడానికి సరిపోరన్నారు. దళితులకు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తులు అంబేద్కర్ ఆలోచనా విధానానికి, భావజాలానికి వ్యతిరేకులన్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి డా.బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని భుజాన వేసుకున్నారు కాబట్టే భారతదేశంలోని ఒక స్మారక చిహ్నంగా ఈ ప్రదేశంగా నిలవనుందన్నారు. ఈవిధంగా అంబేద్కర్ ను గౌరవిస్తున్నందుకు దళితులంతా గర్విస్తున్నామని, తమ హర్షాన్ని ప్రకటిస్తున్నాయ‌న్నారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాదిగ కార్పోరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు, మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీ, రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ మదుసూదనరావు, శాసనసభ్యులు కొలును పార్దసారధి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జోగి రమేష్, కైకే అనిల్ కుమార్, వసంత కృష్ణప్రసాద్, మొండితోక జగన్మోహనరావు, దూలం నాగేశ్వరరావు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఉండవల్లి శ్రీదేవి, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె. హర్షవర్ధన్ కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎ.ఎండి.ఇంతియాజ్, వీయంసి కమీషనరు ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు కె.మాధవీలత, ఎల్.శివశంకర్ మోహనకుమార్, స్థానిక నాయకులు బొప్పన భవకుమార్, జల్లి విల్సన్, దేవినేని అవినాష్, కాలే పుల్లారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Just In...