Published On: Sat, Jun 27th, 2020

మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

* ప‌లాస ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తి అంత్యక్రియలు విషయంలో అమానవీయంగా వ్యవహరించిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి ప్రొక్లెయిన్ ‌ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్.. పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్యారోగ్య శాఖ ఇదివరకే స్పష్టమైన నిబంధనలను జారీచేసిందని ఈ సందర్భంగా ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది.

Just In...