Published On: Wed, Feb 24th, 2021

మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరగాలి…

* కృష్ణా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: గ్రామ పంచాయతి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన తీరులోనే మున్సిపల్ ఎన్నికల నిర్వాహణకు అధికారులు సిద్ధంకావాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏ.యండి.ఇంతియాజ్ ఆదేశించారు. బుధవారం విజ‌య‌వాడ‌లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోజిల్లా ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ఆర్ఓలు, ఏఆర్‌ఓలు, ఇఓలు, ఏఇఓలు, జోనల్అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమావేశంలో మున్సిపల్కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్‌ (ఆసరా) మోహన్‌కుమార్తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్ మాట్లాడుతూసాధారణంగా పట్టణ ప్రాంతంలో ఓటర్ల నిర్లిప్తత కారణంగా ఓటింగ్ శాతంతక్కువుగా ఉంటుందని చెప్పారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగంప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఎన్నికలు జరగడానికి కనీసం 3 రోజులుముందే ఓటర్ స్లిప్లు ఓటర్లకు చేరేలా చూడాలన్నారు. దూరప్రాంతాల్లో ఉన్నఓటర్లు కూడా ఓటరు స్లిప్పులు వచ్చాయని ఓటువేసే అవకాశం ఉంటుంద‌ని ఆశాభావంవ్యక్తం చేశారు. జిల్లాలోని గ్రామపంచాయతి ఎన్నికల్లో దాదాపు 85 శాతంఓటింగ్ నమోదైందని, ఎక్కడా చిన్న గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలుజరిపారన్నారు. అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం 80 శాతంఓటింగ్ నమోదు కావాలని, ఆ మేరకు ప్రయత్నాలు చేయుమని అధికారులను కోరారు.సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘాపెట్టాల‌ని అధికారులను ఆదేశించారు. న‌గ‌ర మున్సిపల్ కమిషనర్‌ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగిఉండాలన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఏదైనా సందేహాలు ఉంటేఉన్న‌తాధికారులను సంప్రదించాలన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీయంలు ఉపయోగించడంలేదని, బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. అందువల్లపోలింగ్ ముందు రోజే ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. జాయింట్కలెక్టర్‌(సంక్షేమం) కె.మోహనరావు మాట్లాడుతూ స్టేజ్-1 ఎన్నికల అధికారులుశిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రియనుండి బ్యాలెట్ పేపర్ల పంపిణీ వరకూ, అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు,ఓటింగ్ నిర్వహించే రోజున, అంతకుముందు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలనువివరించడం జరిగింది. మున్సిపల్ కార్పోరేషన్ చట్టం, మున్సిపల్ పట్టణాలచట్టాలను, ఆర్ఓ, ఏఆర్‌ఓలు ఎన్నికల్లో చేపట్టాల్సిన విధులపై శిక్షణాతరగతుల్లో విశదీకరించారు. కార్య‌క్ర‌మంలో అర్బన్ డెవలప్‌మెంట్ అధికారిఅరుణ, జిల్లాలోని ఎన్నికలు జరుగుతున్న మచిలీపట్నం కార్పోరేషన్, నందిగామ,పెడన, మిగిలిన అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు.

 

Just In...