Published On: Sat, Mar 21st, 2020

ములుగు పంచాంగం ఆవిష్క‌రించిన స్వరూపానంద…

* ఉత్త‌ర అమెరికా తెలుగువారి కోసం ప్ర‌త్యేకం

విశాఖపట్టణం, సెల్ఐటి న్యూస్‌: శ్రీ శారదా పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అమృతహస్తాల మీదుగా ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితులు ములుగు సిద్ధాంతి రచించిన ‘శ్రీ శార్వరి నామ సంవత్సర  ఉగాది పంచాంగం’ విడుదల జరిగింది. విశాఖ‌లోని శ్రీ శారదా పీఠంలో శుక్ర‌వారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ- పూజా స్టోర్ సీఈవో కొడుకుల సోమేశ్వరరావ్ నిర్వహించారు. పంచాంగం విడుదల సందర్భంగా స్వ‌రూపానందేంద్ర స్వామీజీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి మన పూర్వీకులు జ్యోతిష శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ కాలాల్లో జరిగేవి చెబుతున్నారని. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి ములుగు సిద్ధాంతి వెల్లడించిన ఫలితాలన్నీ నిజం అయ్యాయ‌న్నారు. అలాగే ములుగు సిద్ధాంతి గ‌డ‌చిన 30ఏళ్ల‌కుపైగా అందిస్తున్న పంచాంగంలో చెప్పినవన్నీ దాదాపుగా జరుగుతున్నాయని. దైవకృప వల్లనే అది సాధ్యమౌతుందని, రాబోయే శ్రీ శార్వరి నామ సంవత్సరం అందరికీ శుభాలు అందించాలని రాజ్యశ్యాలాదేవి ఆశీస్సులు అందరికీ లభిస్తాయని మంగళవచనాలలో వెల్లడించారు. ఈ-పూజా స్టోర్ అధినేత సోమేశ్వరరావు మాట్లాడుతూ గత 15ఏళ్లుగా ములుగు.కామ్ ద్వారా ములుగు సిద్ధాంతి జ్యోతిష సేవలు అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం ములుగు పంచాంగం అందరికీ ఉచితంగా అందిస్తున్నామని, ఈ సంవత్సరం మొట్టమొదటి సారిగా అమెరికాలోని వారి కోసం వారి సమయాలను గడించి ఆంగ్లంలో నార్త్ అమెరికా పంచాంగం ముద్రించామని తెలిపారు. ఈ పంచాంగాలు అమ్మవారి సమక్షంలో స్వ‌రూపానందేంద్ర స్వామీ చేతుల మీదుగా విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నామని, పంచాంగాలు కావాల్సిన వారు mulugu.comను సంప్రదించాల‌న్నారు. కార్యక్రమంలో రాజేష్, లక్ష్మీపతి, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Just In...