Published On: Tue, Jun 12th, 2018

ముస్లింల అభివృద్ధికి తెదేపా అధిక ప్రాధాన్యత

* ఇఫ్తార్ విందులో ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రంజాన్ మాసం సంద‌ర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరామ్ ఆధ్వర్యంలో నరసరావుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన నమాజ్, ఇఫ్తార్ విందులో ముస్లీం సోదరులతో కలసి ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కోడెల మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. వైద్య వృత్తి పరంగా, రాజకీయంగా నిరంతరం త‌న‌కు తోడుగా ఉన్న ముస్లిం సోదరులంటే ఎంతో ఇష్ట‌మ‌న్నారు. అన్న ఎన్టీయార్ హయాం నుండి ముస్లీంలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ టీడీపీ అన్నారు. ప్ర‌తి ప‌థ‌కంలోనూ ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పేద ముస్లిం సోదరులు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే లక్షంతో ప్రభుత్వం రంజాన్ తోఫా ఇస్తుంద‌న్నారు. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో నరసరావుపేట నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి ఈ ప్రభుత్వం రూ.52 కోట్లు ఖ‌ర్చు చేసింద‌న్నారు.
 

Just In...