Published On: Wed, Jul 21st, 2021

ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు.

Just In...