Published On: Mon, Oct 12th, 2020

మూడు రోజుల‌పాటు భారీ వర్షాలు

* కృష్ణా జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మూలంగా 13 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని, జిల్లాలోని అన్ని మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా  యంత్రాంగం. టెలీకాన్సెరెన్స్ ద్వారా అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలి.

కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు…

* బందరు కలెక్టరేట్: 08672-252572

* విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 – 2474805

* సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ: 0866-2574454

* సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు: 08656- 232717

* రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్: 08672-252486
* రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్: 08674 – 243697
భారీ వర్షాలు కారణంగా పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో
నివసిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ముఖ్యంగా మ‌త్స్యకారులు
ఎవరూ సముద్రంలోకి వేటకు పోరాదు. విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు,
మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు త‌మ‌త‌మ ప్రాంతాల తహశీల్దార్లను అప్రమత్తం
చేయాలి.

Just In...