Published On: Mon, Oct 19th, 2020

మూడో రోజున 10,899 మంది భక్తులకు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

* ఆదాయం రూ.10.68ల‌క్ష‌లు

* ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు వెల్ల‌డి

ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ద‌స‌రా శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజున ఇంద్ర‌కీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన జ‌గ‌న్మాత క‌నకదుర్గమ్మను సోమవారం ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటలు వరకు 10,899 మంది భక్తులు దర్శించుకున్నారని దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు. ఇంద్ర‌కీలాద్రిపై ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రూ.500, రూ.300, రూ.100 టిక్కెట్లు విక్ర‌యాల‌తో పాటు లడ్డు ప్ర‌సాదం, చీర‌ల వేలంపాట రూపేణా దేవ‌స్థానానికి రూ.10,68,365 ఆదాయం సమకూరిందన్నారు. లక్షకుంకుమార్చనకు 40మంది, చండీహోమానికి 14 మంది, శ్రీచక్రనవవర్ణార్ఛనకు న‌లుగురు భ‌క్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని, అమ్మవారి ప్రత్యేక సేవలను పరోక్షంగా ఏకాంతంగా నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు. సమావేశంలో కమిటీ సభ్యులు కె.వెంకటరమణ,
సుజాత, తదితరులు పాల్గొన్నారు. 

Just In...