Published On: Thu, Jul 11th, 2019

మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు ఆర్థిక సహాయం

* చెక్కులు అందించిన విజయవాడ సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: గత కొంత కాలంగా విజయవాడ నగరంలో పనిచేస్తున్న హోంగార్డులలో ఎవరైనా మరణించినా లేక పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం ఉండదు. ఫ‌లితంగా మరణించినా లేదా పదవీ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ కుటుంబాల వారు ఇబ్బందులు పడకుండా ఉండటానికి నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ కలిసి స్వచ్చందంగా వారికి వచ్చే వేతనం నుండి ఆ చనిపోయిన లేదా పదవీవిరమణ చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న విషయం విధితమే. ఈ నేపధ్యంలో విజయవాడ నగరంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా మృతి చెందిన హోంగార్డు కుటుంబ సభ్యులకు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో గురువారం పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు చేతులు మీదుగా రూ.4 ల‌క్ష‌లు నగదు చెక్కుల‌ను అంద‌జేశారు. కార్య‌క్రమంలో జాయింట్ పోలీస్ కమీషనర్ నాగేంద్రకుమార్, అడ్మిన్ డిసిపి కోటేశ్వరరావు, హోంగార్డ్స్ అడ్మిన్ ఆర్‌ఐ శిరీష తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన వారి వివరాలు… కె.హరి ఫని(హెచ్.జి-766), పేచీ అమ్మల్ (డబ్ల్యూ.హెచ్.జి-629).

Just In...