Published On: Mon, Aug 10th, 2020

మృతుల కుటుంబాలకు సీఎం జ‌గ‌న్ ప్రగాఢ సంతాపం

* మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

* ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విజయవాడలోని ప్రైవేట్‌ హోటట్‌లో ఆదివారం జరిగిన అగ్రిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్‌ పేషెంట్లను ఉంచగా, అందులో  అగ్నిప్రమాదం సంభ‌‌వించి పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

 

Just In...