Published On: Tue, Jun 25th, 2019

మెడిటేష‌న్‌తోనే ఆయుష్షు వృద్ధి.. ఆరోగ్య‌సిద్ధి…

* లోట‌స్ లెజెండ్ ధ్యాన‌మందిరం నిర్వాహ‌కురాలు అనంత‌ల‌క్ష్మీ

* డీఎస్ఎం పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు ప‌క్షం రోజుల‌పాటు మెడిటేష‌న్‌, వ్యాయామం త‌ర‌గ‌తులు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మెడిటేష‌న్ చేయ‌డం ద్వారా ఒత్తిడి త‌గ్గి జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గడం, ఆయుష్షు వృద్ధిచెంది ఆరోగ్యంగా ఉండ‌టం త‌దిత‌ర అనేక లాభాలు ఉన్నాయ‌ని లోట‌స్ లెజెండ్ ధ్యాన‌మందిరం నిర్వాహ‌కురాలు ఎస్‌.అనంత‌ల‌క్ష్మీ విద్యార్థుల‌కు సూచించారు. లోట‌స్ లెజెండ్ ధ్యాన‌మందిరం ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లోని కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌లో ఉన్న ద‌ళ‌వాయి సుబ్బ‌రామ‌య్య న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల (డీఎస్ఎం హైస్కూల్‌) లో 9వ త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థుల‌కు సోమ‌వారం నుంచి సుల‌భ‌త‌ర కుండ‌లినీ యోగ (వేదాద్రి మ‌హ‌ర్షి) త‌ర‌గ‌తులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల‌కు మెడిటేష‌న్‌లో భాగంగా ఆఘ్న‌చ‌క్ర, శాంతి, తుర్యం, కాయ‌క‌ల్ప వంటి వాటిపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌తిరోజూ మెడిటేష‌న్ చేయ‌డం ద్వారా ఒత్తిడి త‌గ్గ‌డం, జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గ‌డం, చెడు ఆలోచ‌న‌లు మ‌దిలోకి రాకుండా ఉండ‌టం, ఆయుష్షు వృద్ధి చెంద‌డం, పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వంతో ఏ విధంగా న‌డుచుకోవాలి వంటివి విద్యార్థుల్లో నిరంత‌రం పెంపొందుతాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో గంట పాటు మెడిటేష‌న్‌, వ్యాయామం వంటివి చేయించారు. విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా మెడిటేష‌న్‌లో పాల్గొని సంతృప్తి వ్య‌క్తంచేశారు. మెడిటేష‌న్ త‌ర‌గ‌తుల‌ను డీఎస్ఎం హైస్కూల్‌లో 15 రోజుల పాటు నిర్వ‌హిస్తామ‌ని అనంత‌ల‌క్ష్మీ తెలిపారు. కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు జాన‌కీరాణి, యోగ నిపుణులు హేమ‌ల‌క్ష్మీదేవి, ఎన్‌.ప‌ద్మావ‌తి, కామేశ్వ‌ర‌రావు, పి.వి.ఎల్‌.ప్ర‌సాద్‌, శంక‌ర్‌, బ్ర‌హ్మ‌నందం త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Just In...