Published On: Sun, Oct 6th, 2019

మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం

* విజయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జి.శరత్‌బాబు

* ఘనంగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే తమ లక్ష్యమని, నాణ్యమైన వైద్య చికిత్సలను అన్ని వర్గాల వారికి అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జి.శరత్‌బాబు అన్నారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సూర్యారావుపేటలోని విజయ హాస్పిటల్స్ నందు జరిగిన ఈ వేడుకల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కరతాళధ్వనుల నడుమ డాక్టర్ శరత్‌బాబు కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. అత్యాధునిక వైద్య విధానాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుండి వైద్యం కోసం తరలివస్తున్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విజయ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు. సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రాయితీ అందిస్తున్నామని డాక్టర్ శరత్ బాబు వెల్లడించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఛైర్మన్ జి.వెంకటరావు, న్యూరాలజిస్టు డాక్టర్ రమణారెడ్డి, రేడియాలజిస్టు డాక్టర్ జి.ప్రశాంతి, హాస్పిటల్స్ జీఎం రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Just In...