Published On: Fri, Jul 12th, 2019

మోజో టీవీ మాజీ సీఈవో అరెస్టు

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్‌: మోజో టీవీ మాజీ ఈసీవో రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మణికొండలోని ఆమె ఇంటివద్ద రేవతిని అరెస్టు చేసి పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కేసు విచారణ భాగంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఇంటికి వెళ్లి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Just In...