Published On: Fri, Sep 8th, 2017

మోడల్ జూనియర్ కాలేజీలో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు

సెల్ఐటి న్యూస్‌, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని మున్సిపల్ మోడల్ జూనియర్ కాలేజీలో మంత్రి నారాయణ శుక్ర‌వారం ఉద‌యం ఆకస్మిక తనిఖీలు చేశారు. టీచింగ్, వసతులపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నట్లు మంత్రితో చెప్పారు. ఇక నుంచి ప్రతివారం వీడియో టీచింగ్ narayana_minesterనిర్వహించాలని, కంప్యూటర్ ద్వారా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. 2019లో గవర్నమెంట్ కాలేజీ విద్యార్ధులతో ఐఐటీ ర్యాంకులు సాధిస్తామని మంత్రి చెప్పారు. పేదపిల్లలకు నాణ్యమైన విద్య అందకుండా చట్టసభల్లో విపక్షాలు గోల చేస్తున్నాయంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లను ఎగదోసి ఫౌండేషన్ కోర్సు జరగనీయకూడదని కుట్ర చేశారన్నారు. ఇప్పుడు మోడల్ జూనియర్ కాలేజీలపై విషప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయ‌ణ ఏక‌ర‌వు పెట్టారు.

Just In...