Published On: Mon, Aug 19th, 2019

మ్మెల్సీలుగా ఆ ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం…

సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలిలో ఖాళీ అయిన ముగ్గురు శాసన మండలి సభ్యుల కోసం ఈ నెల 14న ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణలు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కాగా పోటీలో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.బాలకృష్ణమాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలకు శాసనమండలి సభ్యులుగా ఎంపికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.

Just In...