Published On: Tue, Jun 12th, 2018

మ‌త్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

* కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: రానున్న రెండు రోజుల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఈ నేఫ‌ధ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, పర్యాటకులు సముద్ర స్నానాలకు వెళ్లొద్ద‌ని కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. ఈ మేర‌కు
మంగళవారం విజ‌య‌వాడ‌లోని ఆయ‌న విడిది కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ రానున్న రెండు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. వాతావరణంలో వ‌చ్చిన మార్పులు దృష్ట్యా ఎక్కడికక్కడ అధికారులు తమ గమ్యస్థానాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. స్థానిక ఎమ్మార్వోలు, ఎంపిడిలు, విఆర్వోలు, ప్రత్యేక అధికారులు నిరంత‌రం పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు. సోమ‌వారం నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Just In...