మద్యం కోసం కన్నబిడ్డనే విక్రయానికి పెట్టిన తండ్రి
* సమాచారం అందుకుని పాపను కాపాడిన వన్‌టౌన్ పోలీసులు
విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్: కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన కన్నతండ్రే కూతురుని అంగట్లో పెట్టిన వైనం విజయవాడలో మంగళవారం వెలుగుచూసింది. మద్యం కోసం బార్లోనే కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి రూ.5వేలకు కూతురుని విక్రయించే ప్రయత్నం చేస్తుండగా ఛైల్డ్‌లైన్ నుంచి సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి పాపను కాపాడారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సతీష్ అనే వ్యక్తి వన్‌టౌన్ సామారంగం చౌక్‌లోని ఓ బార్లో అతని కూతురుని రూ.5వేలకు
విక్రయించేందుకు యత్నిస్తుండగా తండ్రి సతీష్‌ను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.