Published On: Tue, Nov 13th, 2018

మ‌ధుమేహ వ్యాధిపై నేడు అవ‌గాహ‌న స‌ద‌స్సు

* వ్యాస‌ర‌చ‌న పోటీల విజేత‌ల‌కు జ్ఞాపిక‌లు, ప్ర‌శంసాప‌త్రాలు అంద‌జేత‌

* మ‌ధుమేహ వైద్య నిపుణులు డాక్ట‌ర్ వేణుగోపాల‌రెడ్డి వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: దేశ‌వ్యాప్తంగా మ‌ధుమేహ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామ‌మ‌ని వి.జి.ఆర్‌. డ‌యాబెటిస్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎవ‌ర్నేస్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ కె.వేణుగోపాల‌రెడ్డి (విజిఆర్‌) అన్నారు. మొగ‌ల్రాజ‌పురంలోని వి.జి.ఆర్ డ‌యాబేటిస్ స్పెషాలిటీస్ హాస్పిట‌ల్‌లో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ వేణుగోపాల‌రెడ్డి మాట్లాడుతూ మ‌ధుమేహ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ మొగ‌ల్రాజ‌పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో బుధ‌వారం సాయంత్రం స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. సామాజిక బాధ్య‌త‌గా గ‌డ‌చిన 15 సంవ‌త్స‌రాలుగా వి.జి.ఆర్‌. డ‌యాబెటిస్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎవ‌ర్నేస్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున మ‌ధుమేహ వ్యాధి గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. దానిలో భాగంగా గ‌త నెల‌రోజులుగా మ‌ధుమేహ వ్యాధికి సంబంధించి పాఠ‌శాల స్థాయిలో 21 వేల మంది విద్యార్థుల‌కు వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఇందులో కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల నుంచి 230 పాఠ‌శాల‌ల‌కు చెందిన 21 వేల మంది విద్యార్థులు పాల్గొన్నార‌ని తెలిపారు. వారిలో వెయ్యి మంది విద్యార్థుల‌ను ప్ర‌ధ‌మ‌, ద్వితీయ‌, తృతీయ విజేత‌లుగా ఎంపిక చేశామ‌న్నారు. వ‌ర‌ల్డ్ డ‌యాబెటిస్ డే, చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భంగా బుధ‌వారం సాయంత్రం సిద్ధార్థ ఆడిటోరియంలో మ‌ధుమేహ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వ్యాస‌ర‌చ‌న పోటీల విజేత‌ల‌కు జ్ఞాపిక‌లు, ప్ర‌శంసాప‌త్రాల‌ను అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులంద‌రికీ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థుల‌తో పాటు న‌గ‌ర‌వాసులు అంద‌రూ పాల్గొనాల‌ని డాక్ట‌ర్ వేణుగోపాల‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా విజేత‌ల‌కు పంపిణీ చేసే జ్ఞాపిక‌లు, ప్ర‌శంసాప‌త్రాల‌ను ప్ర‌ద‌ర్శించారు. విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, డాక్ట‌ర్ గీతాప్ర‌వ‌ల్లిక పాల్గొన్నారు.

Just In...