Published On: Mon, Nov 19th, 2018

మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కం స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు అప్ప‌గింత‌

* సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేట్ స్వచ్చంద సేవా సంస్థలకు అప్పగించినప్పటికీ అక్కడ పని చేసే కార్మికులను తొలగించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. స్వరూపరాణి కలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును ప్రయివేట్ స్వచ్చంద సేవా సంస్థలకు అప్పగించడం మూలంగా అందులో పని చేసే కార్మికులకు నష్టం, ఉద్యోగ భద్రత కోల్పోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కె.స్వరూపరాణి ఆవేదన వ్యక్తం చేశారు. స్వరూపరాణి ఆ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ “ ప్రభుత్వ పాటశాలల విద్యార్థులకు మెరుగైన భోజన సదుపాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలును ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం జరిగింది. అయినప్పటికీ మధ్యాహ్న భోజన పథకంలో పని చేసే కార్మికులను తీసివేయం. విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నాం. అక్కడ పని చేస్తున్న కార్మికులను ఇతర పనులను అప్పగించడం జరుగుతుంది . మధ్యాహ్న భోజన పథకాన్ని సేవా సంస్థలకు అప్పగించడం మూలంగా ఎవరికీ అన్యాయం జరగనీయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Just In...