Published On: Thu, Jan 9th, 2020

మ‌న సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌ను కాపాడాలి

* డీఎస్ఎం హైస్కూల్ ప్ర‌ధానొపాధ్యాయులు మాతంగి కోట‌య్య‌

* ఆక‌ట్టుకున్న చిన్నారుల రంగ‌వ‌ల్లులు…

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: స‌ంక్రాంతి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని న‌గ‌రంలోని కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌లో ఉన్న ద‌ళ‌వాయి సుబ్బ‌రామ‌య్య మున్సిప‌ల్ హైస్కూల్‌లో గురువారం నిర్వ‌హించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేత‌లు, విజ‌య‌వాడ స్వ‌రాజ్య మైదానంలో జ‌రుగుతున్న పుస్త‌క మ‌హోత్స‌వాన్ని తిల‌కించి పుస్త‌కాలు కొనుగోలు చేసిన విద్యార్థినీ, విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేస్తున్న పాఠ‌శాల ప్ర‌ధానొపాధ్యాయులు మాతంగి కోట‌య్య‌. కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు దుర్గాభవాని, భానుప్రకాష్, తెలుగు ప౦డితులు ఆర్‌.బి.ఉదయ్ కిరణ్, బ‌హుమ‌తుల దాత పులిపాటి క‌న‌క‌దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మన ప౦డుగల వెనుక ఉన్న అసలు అర్థం తెలుసుకోవాలని, మన స౦స్కృతి, స౦ప్రదాయాలను కాపాడుకు౦టూ, పెద్దలను గౌరవి౦చట౦, చెప్పిన మ౦చి మాటలను ఆచరి౦చాలని అన్నారు. పాఠశాలకు ఆవరణ లేకపోవడం, భవన౦ సమస్యను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లట౦ జరిగి౦దని తెలిపారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌కు ప౦డుగ శుభాకాంక్షలు చెప్పారు. పోటీలలో బహుమతి పొ౦దట౦ కన్నా పాల్గొనట౦ విద్యార్థులకు ముఖ్యమన్నారు. ఈ  సంద‌ర్భంగా విజేతలను ప్రత్యేక౦గా ఆయన అభినందించారు. దాత పులిపాటి కనకదుర్గ మాట్లాడుతూ సరైన స్థలం లేనప్పటకీ సుమారు 150 మంది విద్యార్థినులు పాల్గొనట౦ చూస్తే వారి ఆసక్తి చూపడం అభిన౦దనీయ౦, అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి పోటీలో  ఉత్సాహ౦గా పాలుప౦చుకోవాలన్నారు.

Just In...