Published On: Tue, Oct 30th, 2018

మ‌లేషియా మెరుగైన విద్యావిధానాల‌పై అధ్య‌య‌నం

* మంత్రి గంటా శ్రీనివాస‌రావు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్-ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో మ‌లేషియా విశ్వ‌విద్యాల‌యాల్లో అవంభిస్తున్న మెరుగైన విద్యావిధానాలు, సంస్క‌ర‌ణ‌ల‌ను అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు. మూడు రోజుల అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  మంత్రి గంటా ఆధ్వ‌ర్యంలోనే అధికారుల‌ బృందం సోమ‌వారం మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపుర్ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ న‌వ్యాంధ్ర విద్యా విధానంలో ప‌లు సంస్క‌ర‌ణ‌లు ఇప్ప‌టికే తెచ్చామ‌ని, సాంకేతిక‌తో పూర్తిగా అనుసంధానం అయ్యామ‌ని అన్నారు. మ‌రిన్ని మెరుగైన సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా మ‌లేషియాలో ప‌ర్య‌టించి, ఇక్క‌డి వ‌ర్శ‌టీ విద్యావిధానం, ఉపాధిని పెంచే కోర్సులు త‌దిత‌ర అంశాల‌పై అధ్య‌య‌నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంత్రి గంటా సోమ‌వారం ప‌లు వ‌ర్శ‌టీల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. అక్క‌డి విద్యాశాఖ అధికారులు కూడా మంత్రితో స‌మావేశ‌మై మలేషియా విద్యావిధానంపై వివ‌రించారు. యూకేఎమ్ విశ్వ‌విద్యాల‌య ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించారు. మంగ‌ళ‌వారం మంత్రి గంటా ప‌లు వ‌ర్శ‌టీల‌ను సంద‌ర్శించి అక్క‌డి అధికారులు, విద్యార్థులతో భేటీ కానున్నారు. ప‌లు అంశాల్లో ప‌ర‌స్ప‌ర ఒప్పందాలు చేసుకునే దిశ‌గా క‌స‌ర‌త్తు చేయ‌నున్న‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. మంత్రి గంటా బృందంలో విక్ర‌మ సింహాపురి విశ్వ‌విద్యాల‌యం వైస్ చాన్స‌ల‌ర్ ఆర్.సుద‌ర్శ‌న్‌రావు, ఉన్న‌త విద్యామండ‌లి స‌లహాదారు డాక్ట‌ర్ ఈద‌ర వెంక‌ట్ త‌దిత‌రులు ఉన్నారు.

Just In...