Published On: Fri, May 29th, 2020

మ‌ళ్లీ ప‌ద‌విలోకి వ‌చ్చా…

* త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తా

* నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ నియామకం, పదవీకాలం విషయమై ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను శుక్ర‌వారం కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ను నియనించాలని కూడా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేప‌ధ్యంలో నిమ్మ‌గ‌డ్డ ‌ర‌మేష్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చినట్లు తెలిపారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయ‌న పేర్కొన్నారు. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తాను అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యమని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలని సూచించారు.

Just In...