Published On: Mon, Jan 4th, 2021

మ‌హంతి చేప‌ల మార్కెట్‌లో అధికారుల త‌నిఖీ…

* నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వ్యాపారులు

* 14 కేసులు న‌మోదు చేసిన తూనిక‌లు, కొల‌త‌లు శాఖ అధికారులు

విజ‌య‌వాడ క్రైం‌, సెల్ఐటి న్యూస్:‌ తూనిక‌లు, కొల‌తలు శాఖ డిప్యూటీ కంట్రోల‌ర్ ఎ.కృష్ణ‌చైత‌న్య ఆదేశాల మేర‌కు విజ‌య‌వాడ‌ గ‌వ‌ర్న‌ర్‌పేట‌లోని ‌మ‌హంతి చేప‌ల మార్కెట్‌లో అసిస్టెంట్ క్రంటోల‌ర్‌-1 టి.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉద‌యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించి విక్ర‌యాలు సాగిస్తున్న ప‌లువురు వ్యాపారుల‌పై 14 కేసులు నమోదు చేశారు. అధికారులు దాడులు చేస్తున్న స‌మ‌యంలో ప‌లువురు దుకా‌ణాలు మూసివేసి అక్క‌డ నుంచి పారిపోయారు. అధికారుల దాడుల్లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ ఇన్‌స్పెక్ట‌ర్లు వాసుదేవరావు, శ్రీకాంత్, సులేమాన్, ఈశ్వరరావు ప‌లువురు సిబ్బంది పాల్గొన్నారు.

Just In...