Published On: Sun, Oct 25th, 2020

మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

* బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: హిందువుల పవిత్ర బతుకమ్మలు ఆడుతున్న మహిళల్ని నిలిపి, అవమానించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాల‌ని భాజ‌పా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి కృష్ణా జిల్లా, జయంతి గ్రామంలో బతుకమ్మలు ఆడుతున్న మహిళల్ని అడ్డుకుని బతకమ్మను జరగనివ్వను అని జీపులో కూర్చున్న వీరులపాడు ఎస్సై హరిప్రసాద్ అవమానించడం, గుడిలో పూజ జరుగుతుంటే మైకుని సైతం ఆపేసిన ఆ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో కలసి పోలీసు అధికారులకు శుక్ర‌వారం ఆ గ్రామాన్ని సంద‌ర్శించిన విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ .. జయంతి గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలకు ఇబ్బంది కలగుకుండా చర్యలు తీసుకోంటామనని, దురుసుగా ప్రవర్తించిన వీరులపాడు ఏస్ఐ హరిప్రాసాద్‌పై ఉన్నతాదికారులకు పిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని డిఏస్పి రమణమూర్తి ప్రజలకు హామీ ఇచ్చార‌ని విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి తెలిపారు. పర్యటనలో ,స్తానిక గ్రామ పెద్దలు మరియ భాజపా నాయకులు, యువమోర్చా రాష్ట్ర ఉపాద్యక్షుడు రవీందర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ గంగాధర్, నందిగామ నియోజకవర్గ కన్వినర్ పోరుగంటి నరసింహారావు, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఉమామహేశ్వరరావు, గురునాధం, వందేమాతరం అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Just In...