Published On: Tue, Feb 4th, 2020

మ‌హిళ హ‌త్య కేసును చేధించిన పోలీసులు…

* నిందితుడు పాత నేర‌స్తుడే

* రూ.1.50ల‌క్ష‌లు న‌గ‌దు, 86 గ్రాముల బంగారం, ద్విచ‌క్ర వాహ‌నం స్వాధీనం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం: విజ‌య‌వాడ‌లో గ‌త నెల 31న భవానీపురంలోని ప‌ప్పుల‌మిల్లు రోడ్డులో జ‌రిగిన యేదుపాటి పద్మావ‌తి అనే మహిళ హత్య కేసును పోలీసులు కేవ‌లం నాలుగు రోజుల్లోనే చేధించ‌డం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు అన్నారు. మ‌హిళ హ‌త్య కేసు వివ‌రాల‌ను మంగ‌ళ‌వారం త‌మ కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు వెల్ల‌డించారు.  ఆయ‌న మాట్లాడుతూ మ‌హిళ హ‌త్య అనంత‌రం బంగారు ఆభరణాలు అపహరణ జరిగాయి. నేరం జ‌రిగిన స్థలాన్ని పరిశీలించాక అనేక అనుమానాలు వచ్చాయి. వేలి ముద్రల‌ను పరిశీలించాము. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ద్విచ‌క్ర వాహ‌నం క్లూ దొరికింది. ఈ క్ర‌మంలో పాత నేరస్తుల డేటా, సాంకేతికితను జోడించాము. గ‌త ఏడాది జులైలో జరిగిన పరిష్కారం కాని మరొక హత్య కేసుకు పోలిక ఉండడంతో ఆ దిశ‌గా అనుమానించి ఊహ చిత్రం గీయించాము. రెండు ఘ‌ట‌న‌ల్లోనూ ఒకే షర్ట్ వాడారు, బైక్‌ల‌ను మార్చారు. నిందితుడి నుండి పల్సర్ బైక్, మనప్పురం గోల్డ్‌లో  తాకట్టు పెట్టిన  బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం. పెనమలూరు మండలం చోడవరానికి చెందిన గ‌విరినేని అనిల్‌కుమార్ కళ్యాణ మండపంలో పని చేసేవాడు. ముద్దనూరులో వ్యాపారం చేయాలని ప్రయత్నం చేశాడు. సినిమాలు చూసి నేరాలు ఆ ప్ర‌భావంతో సులభంగా చేయడం ప్రారంభించాడు. గ‌తేడాది జులై 10న విద్యాధరపురంలో ఒక దోపిడీ కేసులో నిందితుడు అనిల్‌కుమార్ ప్ర‌మేయం ఉంది. ఐఓబిలో రూ.1.53ల‌క్ష‌ల‌కు బంగారం తాకట్టు పెట్టాడు. మ‌హిళ హ‌త్య కేసును చేధించిన వారికి లక్ష రివార్డ్ ప్రకటించాము. మ‌హిళ‌ను హ‌త్య చేసిన అనంత‌రం ఉద్దేశ్యపూరకంగానే నిందితుడు కారం జల్లాడు. పోలీసుల‌ను తప్పుదోవ పట్టించి ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. గుర్తు పట్టకుండా ఉండాలని గుండు గీయించుకున్నాడు. 2019 మార్చిలో బంగారం తాకట్టు పెట్టిన రసీదు ఉంది. మరో నేరం చేసుంటాడాని  కూడా అనుమానిస్తున్నాము. హ‌త్య కేసును చేధించ‌డంలో డిసిపి విక్రమ్ పాటిల్, ఏసిపి సుధాకర్, భ‌వానీపురం పోలీస్‌స్టేష‌న్ సీఐ మోహన్ రెడ్డి, క్రైమ్ డిసిపి కోటేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ సీఐ శివాజీలు బాగా పనిచేశార‌ని పేర్కొంటూ సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఈ సంద‌ర్భంగా వారికి అవార్డులు, అభినందనలు తెలిపారు.

Just In...