Published On: Tue, Sep 24th, 2019

యరపతినేనిపై ఆరోపణల కేసు కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ ప్రభుత్వం

* మైనింగ్ తవ్వకాల ఆరోపణలు సంబంధిత వివరాలతో కేంద్రానికి నివేదిక

* సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన ఏపీ సర్కార్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: మైనింగ్ తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటన్న ఏపీ టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సీఐడీ విచారణ పూర్తయింది. ఇందుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను సీబీఐకు అందజేసినట్టు సమాచారం. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి పునరుద్ధరించిన తర్వాత ఆ శాఖకు అప్పగించిన తొలి కేసు ఇది.

Just In...