Published On: Thu, Jan 23rd, 2020

యువతలో మార్పు ద్వారానే ప్రమాదాలు తగ్గించగలం

* ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సులో విద్యార్థుల‌కు డిటీసీ వెంకటేశ్వరరావు సూచ‌న‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే యువతలో మార్పు రావాలని రోడ్డు నిబంధనల ప్రకారమే వాహనాలు నడిపితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ద్విచక్ర వాహనములు నడిపేవారే ఎక్కువుగా మృత్యువాత పడుతున్నారని దానికి ప్రధాన కారణం ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ దరించి ఉండకపోవడమేనని ఆయన అన్నారు. బాధ్యత కలిగిన పౌరులు భద్రతతో కూడిన రోడ్డు నియమాలను పాటించాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమని దానికి తోడు హెల్మెట్ ధరించకపోవడం అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. బిఐఎస్ స్టాండర్డ్ కలిగిన హెల్మెట్ ను ధరించాలని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా హెల్మెట్ ధరించకుండ వాహనం నడిపిన, అధిక స్పీడ్, త్రిబుల్స్ డ్రైవింగ్ చేసిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ నిర్ణయాలు తీసుకున్నామని కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో వాహనం నడిపిన వ్యక్తిపై వాహనయజమాని పై జైలు శిక్షలు కూడా వేసి అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. రోడ్డు నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.కె.ఎస్.వి.ప్రసాద్, మోటార్ వాహన తనిఖీ అధికారులు జి.సంజీవ్‌కుమార్, జి.ప్రసాద్‌రావు, ఆర్.ప్రవీణ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Just In...